Telangana,warangal, సెప్టెంబర్ 3 -- గంజాయి సరఫరా, రవాణపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జరిపిన సోదాల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.81 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు సెప్టెంబర్ 1వ తేదీన ఖానాపూర్ మండలం చిలుకమ్మ నగర్ అటవీ ప్రాంతంలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. విచారణలో నలుగురు వ్యక్తులు సుమారు 750 కిలోల ఎండు గంజాయిని కలిగి ఉన్నట్లు అంగీకరించారని వివరించారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల ఆదేశాల మేరకు రవాణా చేస్తున్నట్లు చెప్పారని పేర్కొన్నారు.

సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1వ తేదీన డ్రగ్ కంట్రోల్ టీం వరంగల్, ఖానాపూర్ ...