భారతదేశం, నవంబర్ 26 -- వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టును భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

మరోవైపు వరంగల్ నిట్ లో టీచింగ్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 45 ఉద్యోగాలున్నాయి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. 12-11-2025 నుంచి 12-12-2025 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ వరకు అందిన అన్ని ఆన్‌లైన్ దరఖాస్తులను ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో స్క్రూటినీ చేసి షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. బోధన మరియు పరిశోధన సెమినార్ ప్రదర్శన ద్వారా తదుప...