భారతదేశం, డిసెంబర్ 2 -- ఏసీబీ అధికారి ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురి సభ్యులను వరంగల్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ఘరానా నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ద్వారా ఈ ముఠా వ్యవహారాలను గుట్టు రట్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఏపీకి చెందిన శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు(45) ఉన్నాడు. నవీన్, మంగళ రవీందర్, మురళి, ప్రసన్న కూడా ఉండగా. సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో వున్నారు...