భారతదేశం, నవంబర్ 12 -- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (నిట్ వరంగల్) 45.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు తేదీ ఇప్పటికే ప్రారంభమైంది. 12-11-2025 నుంచి 12-12-2025 వరకు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

ప్రొఫెసర్-02, అసోసియేట్ ప్రొఫెసర్-08, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 -08, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 -27 పోస్టులు ఉన్నాయి. మెుత్తం 45 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది.

బీఈ/బి. టెక్, ఎంఇ/ఎం. టెక్ ఇన్ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ , ఎంసీఎ, ఎంబీఎ, బి.ఎస్సీ, ఎం.ఎస్సీ పోస్టును బట్టి అర్హతలు ఉండాలి. కనీస వయోపరిమితి 35 సంవత్సరాలు కాగా గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లుగా నిర...