భారతదేశం, డిసెంబర్ 18 -- టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 15R (OnePlus 15R) ఎట్టకేలకు బుధవారం నాడు భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే లుక్స్‌తో వచ్చిన ఈ ఫోన్, ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న ఒప్పో రెనో 14 ప్రో 5G (Oppo Reno 14 Pro 5G) తో పోటీ పడనుంది. సుమారు రూ. 50 వేల ధరలో ఈ రెండు ఫోన్లు ఒకదానికొకటి గట్టి పోటీనిస్తున్నాయి. మరి మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ ఫోన్ ఎంచుకోవాలి? వీటి మధ్య ఉన్న అసలైన తేడాలేంటి? పూర్తి వివరాలు మీ కోసం..

ధర విషయానికి వస్తే, వన్ ప్లస్ కాస్త తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.

వన్ ప్లస్ 15R: 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 47,999. కాగా, 512GB మోడల్ ధర రూ. 52,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో దీనిని రూ. 44,999 కే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 22 నుంచి అమెజాన్, వన్ ప్లస్ స్టోర...