భారతదేశం, డిసెంబర్ 28 -- మీరు వన్‌ప్లస్ బ్రాండ్ ప్రేమికులా? కొత్త ఏడాదిలో ఒక పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే! అమెజాన్ నిర్వహిస్తున్న 'ఇయర్ ఎండ్ సేల్' (Year End Sale) లో వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కళ్లు చెదిరే ధరకే లభిస్తోంది. కేవలం బ్యాంక్ ఆఫర్లు మాత్రమే కాకుండా, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా కలిపితే ఈ ఫోన్ ధర అనూహ్యంగా తగ్గిపోయింది.

వన్‌ప్లస్ 13 (12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్ అసలు ధర Rs.72,999 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో ఇది Rs.63,999 కే లిస్ట్ అయ్యింది. దీనికి తోడు అదనపు లాభాలు ఇక్కడ ఉన్నాయి.

బ్యాంక్ ఆఫర్: మీరు హెచ్‌డిఎఫ్‌సి (HDFC) లేదా యాక్సిస్ (Axis) బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే అదనంగా Rs.4,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్: పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా గరిష్టంగ...