భారతదేశం, అక్టోబర్ 7 -- వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బిగ్​ అప్డేట్​! సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో కూడిన ఆక్సిజన్‌ఓఎస్ 16 (OxygenOS 16) అప్‌డేట్‌ను ఈ నెలలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. అక్టోబర్​ 16న ఇది విడుదల అవుతుంది.

ఈ కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్​లో ఏయే ఫీచర్లు ఉంటాయో, ఏయే డివైజ్‌లకు ముందుగా అప్‌డేట్ అందుతుందో అనే విషయంపై వన్‌ప్లస్ పెద్దగా వివరాలు వెల్లడించనప్పటికీ, వన్‌ప్లస్ కమ్యూనిటీ పోస్ట్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఈ అప్‌డేట్‌ను పొందగల డివైజ్‌ల తాత్కాలిక జాబితా లభించింది.

వన్‌ప్లస్ 13

వన్‌ప్లస్ నార్డ్ 5

వన్‌ప్లస్ 13ఆర్

వన్‌ప్లస్ నార్డ్ 4

వన్‌ప్లస్ 13ఎస్

వన్‌ప్లస్ నార్డ్ 3

వన్‌ప్లస్ ఓపెన్

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5

వన్‌ప్లస్ 12

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4

వన్‌ప్లస్ 12ఆర్

వన్‌ప్లస్ నార...