భారతదేశం, జనవరి 11 -- ఓ వైపు సంక్రాంతి సెలవులు, మరోవైపు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ములుగు జిల్లాలోని మేడారంలో జనసందోహం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు మెుక్కులు చెల్లించడానికి రావడంతో సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం సందడిగా కనిపించింది. భారీ రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంక్రాంతి సెలవులు కావడంతో సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా వచ్చి వనదేవతలకు మెుక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అనంతరం గద్దెల దగ్గర మెుక్కులు సమర్పిస్తున్నారు.

మేడారం చుట్టూ భక్తులు కిటకిటలాడుతున్నారు. నిజానికి జనవరి 28వ తేదీ నుంచి 31 వరకు మహాజ...