Telangana, జూలై 18 -- తెలంగాణ టెట్ - 2025 పరీక్షల (జూన్ సెషన్) ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. దీంతో తుది ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.

తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చే వారం వచ్చే అవకాశం ఉంది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే. జూలై 22వ తేదీన ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తి కావటంతో. ఈ తేదీనే విడుదల చేస్తారని తెలుస్తోంది. ఒక వేళ ఏదైనా ఆలస్యమైనప్పటికీ.. ఒకటి రెండు రోజుల తేడాలోనే ప్రకటించే అవకాశం ఉంది.

జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా.. 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అం...