భారతదేశం, సెప్టెంబర్ 8 -- ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీ పెరిగిన ఈ తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా జర్మనీలో జరుగుతున్న ఐఏఏ మొబిలిటీ 2025లో తమ కొత్త ఎపిక్ (Epiq) ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఇది సిటీ క్రాసోవర్ సెగ్మెంట్‌కు చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ. స్కోడా శ్రేణిలో అత్యంత సరసమైన ధరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ కారు 2026 ఆరంభంలో ఉత్పత్తిలోకి వెళ్లనుంది.

చిన్న, సిటీ-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో, స్కోడా ఎపిక్ ఒక పెట్రోల్ కారు ధరలోనే మెరుగైన ప్రాక్టికాలిటీ, రేంజ్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

4.1 మీటర్ల పొడవు ఉన్న స్కోడా ఎపిక్ ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ. కానీ లోపల స్థలం విషయంలో మాత్రం రాజీ పడలేదు. ఇందులో ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. 475 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ ఉంది. ఈ కారు ఒకసారి ...