Hyderabad, అక్టోబర్ 8 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం దీపావళి నాడు ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతోంది. ఇది వంద సంవత్సరాల తర్వాత ఏర్పడడం విశేషం. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. సుమారు 100 సంవత్సరాల తర్వాత ఏర్పడే ఈ యోగం ఈ రాశుల వారి జీవితాన్నే మార్చబోతోంది.

గురువు తన సొంత రాశి అయినటువంటి కర్కాటకంలో తిరోగమనం చెందుతున్నాడు. ఇలా గురువు తిరోగమనం చెందడంతో హంస మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. అక్టోబర్ 20న దీపావళి నాడు ఈ యోగం ఏర్పడడం చాలా విశేషం. పైగా ఈ యోగం అరుదైనది. గురువు కర్కాటకంలో సంచరించడం కొన్ని రాశుల వారి జీవితాన్ని మార్చేస్తుంది.

ఈ రాశుల వారి జీవితంలో శుభ ఫలితాలు ఎదురవుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. గురువు తిరోగమనంలో కర్కాటకంలోకి ...