భారతదేశం, నవంబర్ 27 -- దాదాపు వందేళ్ల కిందట కేటాయించిన నీటిపై తెలంగాణ హక్కు కలిగి ఉండదని బుధవారం న్యూఢిల్లీలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II (KWDT-II) ముందు ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో ఏపీ పెట్టుబడుల పూర్తి విలువను తెలంగాణ వారసత్వంగా పొందిందని మాట్లాడింది. కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్న తెలంగాణ.. గోదావరి జలాల గురించి దాస్తోందని ఏపీ చెప్పింది. రెండు నదుల జలాలను కలిపి చూస్తే తెలంగాణకు నీటికి లోటే లేదని పేర్కొంది.

కృష్ణా జలాల పున:సమీక్షపై జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ సారథ్యంలోని కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌-2 విచారణలో రెండో రోజు కూడా ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా గట్టిగా వాదనలు వినిపించారు. నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్స్ ఇచ్చిన ఆదేశాలను మార్చేందుకు ఆస్కారం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్య...