Hyderabad, ఏప్రిల్ 14 -- ఎవరి ఇంటిలోనైనా ముఖ్యమైన భాగం వంటగది. అక్కడే కుటుంబానికి అవసరమైన ఆహారం సిద్ధమవుతుంది. ప్రతి మహిళ ఇంట్లోని వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కానీ వంటగది క్లీన్ అంత సులువు కాదు. మిగతా గదులతో పోలిస్తే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే వంట చేసేటప్పుడు, నూనె, ఆవిరి, మసాలా దినుసులు వంటగది గోడలు జిడ్డుగా మారుతాయి. వంటగది గోడలపై ఉన్న మరకలు పొగట్టడానికి ఎంతో అలసిపోతారు. కొన్ని శుభ్రపరిచే ట్రిక్స్ మీ వంటగదిని మెరిపిస్తాయి. గోడలను శుభ్రం చేయడానికి చిట్కాలు గురించి ఇక్కడ ఇచ్చాము. వీటిని ఫాలో అయితే మీ వంటగది మిల మిల మెరిసిపోతుంది. గదికి పట్టిన గ్రీజు త్వరగా వదిలేస్తుంది.

వంటగది గోడలను శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. ఈ రెమెడీ చేయడానికి, స్ప్రే బాటిల్ లో ఒక కప్పు వెనిగర్, ఒక కప్పు నీరు వ...