Hyderabad, ఏప్రిల్ 9 -- హిందూ ధర్మంలో ఇంటిలోని వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్కడ అన్నపూర్ణాదేవి నివాసం ఉంటుందని చెప్పుకుంటారు. అన్నపూర్ణాదేవి ఎవరో కాదు లక్ష్మీదేవికి మరో రూపమే. అన్నపూర్ణాదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం.

వంటగది పరిశుభ్రంగా ఉండడమే కాదు, వంటగదిలో వాస్తు ప్రకారం ఏమీ లేకపోయినా లక్ష్మీదేవి బాధ పడుతుందని సంపద, శ్రేయస్సు లేకుండా ఆ ఇల్లు పేదరికంలోకి మారుతుందని చెప్పుకుంటారు.

వంట గదిలో కొన్ని వస్తువులు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. వాటికి ఎలాంటి లోటు రాకూడదు. వంట గదిలో ఆ వస్తువులు లోపిస్తే కుటుంబ ఆదాయం తగ్గిపోతుంది. దీనివల్ల వ్యాధులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆ కుటుంబం కొత్త సమస్యలు చిక్కుకోవడం మొదలవుతుంది. కాబట్టి ఏ వస్తువులు వంటగదిలో నిండుగా ఉండాలో తెలుసుకోండి.

వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో చక్కెర ఎప్పుడూ నిండుగా ఉండాలి. దాన...