భారతదేశం, ఏప్రిల్ 20 -- పొగిడితే పడిపోని వారు ఎవరుంటారు? ఇక తన ప్రేయసిని వర్ణిస్తూ ప్రియుడు పాట పాడితే ఎలాంటి అమ్మాయి అయినా ఇంప్రెస్ కావాల్సిందే. ఇదిగో ఈ సాంగ్ అలాంటిది. ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్స్ లో ఒకటైన 'ప్రియా ప్రియా' సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటోంది. అమ్మాయిని పొగడటంతో పాటు ఆమె కోసం ప్రాణాలైనా ఇస్తా అంటూ ఈ సాంగ్ లో ప్రియుడు పడే తపన కనిపిస్తోంది.

1998లో వచ్చిన 'జీన్స్' సినిమాలోని 'ప్రియా ప్రియా' సాంగ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇది తమిళ్ ఒరిజినిల్ మూవీ అయినప్పటికీ.. తెలుగులో ఈ సాంగ్ కోసం శివగణేష్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. ఈ పాటను అంతే అమేజింగ్ గా జీన్స్ శ్రీనివాస్ ఆలపించారు. ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందంటే.. ఈ మూవీ నేమ్ సింగర్ ఇంటి పేరుగా మారిపోయింది.

ఇక ఈ సాంగ్ లో ...