భారతదేశం, నవంబర్ 17 -- తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​ - II పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సెలక్షన్ లిస్టును విడుదల చేసింది. ఈ పోస్టులకు 24,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. 23,323 పరీక్ష రాశారు. అంతకుముందు మెరిట్ లిస్ట్ ప్రకటించగా.. తాజాగా సెలక్ట్ అయిన 1260 మంది ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేశారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ జాబితాను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సచివాలయంలోని ఆయన కార్యాలయంలో తాజాగా విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది.

స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్ట్ త్వరలో విడుదల కానుంది. ఇందులో 18 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన వారి పేర్లను ప్రత్యేకంగా విడుదల ...