Hyderabad, మే 5 -- తెలుగు ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'లోర్వెన్ ఏఐ' (Lorven AI Studio) స్టూడియోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కి తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

లోర్వెన్ ఏఐ స్టూడియో లాంచ్‌లో నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఏఐ గురించి గత రెండేళ్లుగా డిస్కషన్ స్టార్ట్ చేశాం. మా కంపెనీ నుంచి స్టార్ట్ అయిన టీం, క్వాంటంతో కలసి సినిమా గురించి డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. 360 డిగ్రీస్‌లో సినిమాని ఎలా చేయొచ్చు అనేది క్రియేటివ్‌గా డెవలప్ చేయడం జరిగింది" అని అన్నారు.

"స్క్రిప్ట్ ఐడియా నుంచి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యేవరకు ఒక స్టేజ్. న్యూ కమ్మర్స్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట...