భారతదేశం, డిసెంబర్ 29 -- ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, ఓవర్‌లోడింగ్ కారణంగా ఒక లారీ నిండు ప్రాణాన్ని బలిగొన్న తీరు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాంపూర్ జిల్లా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడీ గేట్ సమీపంలో ఆదివారం ఈ విషాదం జరిగింది.

వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. పొట్టు (Husk) లోడుతో వెళ్తున్న ఒక ఓవర్‌లోడెడ్ లారీ పహాడీ గేట్ వద్ద రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ ఒక్కసారిగా అదుపుతప్పి, పక్కనే వెళ్తున్న బొలేరో కారుపై బోల్తా పడింది. లారీ బరువుకు కారు అప్పడంలా నలిగిపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఫిరాసత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక నివాసిగా పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున...