Telangana, ఆగస్టు 31 -- రీడిజైన్ పేరుతో ప్రతి ప్రాజెక్టును చీల్చి చెండాడారు. ఇవన్నీ పెంచి అదనంగా నీళ్లు ఇచ్చారా? మేడిగడ్డ, సుందిళ్ల పనికిరాకుండా పోయాయి. ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదు. హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టు లాగా కుంగిపోయారు. నిటారుగా నిలబడలేక పోతున్నారు: భట్టి విక్రమార్క

కాళేశ్వరం మీకోసమే.. ప్రజల కోసం కాదు. కనీసం కేబినెట్ అప్రూవల్ కూడా లేదు. కుంగిపోకముందే NDSA కొన్ని సూచనలు చేసింది. వాటిని కూడా పట్టించుకోలేదు.కేసీఆర్ చెప్పారు, హరీష్ రావు కట్టారు. కమిషన్ మమ్మల్ని పిలవలేదని హరీష్ రావు చెబుతున్నారు. ఎవరైనా రావచ్చని కమిషన్ ఓపెన్ గా ప్రకటనలు ఇచ్చింది : భట్టి విక్రమార్క

సభలో చర్చకు వస్తుంటే అల్లరి చేస్తున్నారు. లక్ష కోట్ల దోపిడి చేశారు. జస్టిస్ ఘోష్ రిపోర్టుపై మాత్రమే మేము మాట్లాడాం. రాజకీయ ఆరోపణలు చేయలేదు, కక్ష సాధింపులు...