Hyderabad, ఫిబ్రవరి 5 -- మన సమాజంలో లైంగిక ప్రక్రియ గురించి బహిరంగంగా మాట్లాడడం ఇప్పటికీ నిషిద్ధమైన అంశంగానే చూస్తున్నారు. అందుకే దీని గురించి ఎవరూ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడే ధైర్యం చేయరు. దీని ఫలితంగా ప్రజల్లో లైంగిక అవగాహన లోపిస్తుంది. లైంగిక ప్రక్రియ గురించి అనేక అపోహలు ప్రజలలో ఉండడం చాలా సాధారణం. అవి మీ లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

లైంగిక ప్రక్రియ సమయంలో కండోమ్ లు వాడే వారి సంఖ్య అధికమే. కండోమ్ ల వడకం వారి లైంగిక ఆనందంపై ప్రభావం చూపుతుందని కొంతమంది నమ్ముతారు. కండోమ్‌ల మందపాటి పొర వల్ల సెక్స్ చేసినప్పుడు వచ్చే అనుభూతిని పొందలేరని ఎంతో మంది అనుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి, కండోమ్ల తయారీకి చాలా పలుచని లేటెక్స్‌ను ఉపయోగిస్తారు. మీకు తగ్గట్టు సరైన పరిమాణం, ఆకారంలో ఉన్న కండోమ్‌ను వాడడం ద్వారా ఎలాంటి లోపం ల...