Hyderabad, మార్చి 11 -- రాత్రిపూట నైటీలు, టీషర్టులు, పైజామాలు వేసుకుని పడుకోవడం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని ధరించడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. కానీ ఇలాంటి దుస్తులు మీ లైంగిక జీవితం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? వేసుకునే బట్టలు శారీరక సుఖం విషయంలో అంతటి ప్రభావం చూపుతాయా? అనే సందేహం మీలో కలిగి ఉండచ్చు. గతంలో ఇటువంటి ఆలోచన కూడా మీకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. రాత్రిపూట మీ కంఫర్ట్ కోసం మీరు వేసుకునే బట్టల వల్ల మీ భాగస్వామికి మీరు ఫిజికల్ పార్ట్‌నర్‌గా కాకుండా కేవలం స్లీపింగ్ పార్ట్‌నర్‌గా మాత్రమే అనిపిస్తారట.

అంటే మీరు పడుకునేటప్పుడు మీకు కంఫర్ట్ గా ఉండే బట్టలకు బదులుగా మీరు మరింత అందంగా కనిపించే వాటిని ధరించండి. అంటే నైటీలు, టీషర్ట్‌లు పైజామాలకు బదు...