భారతదేశం, జూలై 23 -- ఫర్జానా ఖాన్ అనే మహిళ తన 32 ఏళ్ల భర్త మహ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్‌ను హత్య చేసింది. తొలుత ఇది ఆత్మహత్య అని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు ఆమె ఫోన్ పరిశీలించగా, "వ్యక్తిని ఎలా చంపాలి?" అనే సందేహాస్పద శోధన చరిత్ర (search history) వారికి కనిపించింది. దీంతో ఆమెను గట్టిగా ప్రశ్నించగా, ఫర్జానా తన నేరాన్ని అంగీకరించింది. తమ దాంపత్య జీవితంపై తాను అసంతృప్తిగా ఉన్నందువల్లే భర్తను చంపినట్లు వెల్లడించింది.

పోలీసుల విచారణలో ఫర్జానా షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తన భర్త షాహిద్ లైంగికంగా సంతృప్తిపరచలేకపోయాడని, ఆన్‌లైన్ జూదం వల్ల భారీ అప్పుల్లో కూరుకుపోయాడని తెలిపింది. అంతేకాకుండా, ఆమె తన భర్త బంధువుతో వివాహేతర సంబంధం కూడా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మూడు కారణాలే హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

పో...