భారతదేశం, నవంబర్ 23 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పదకొండో వారం వీకెండ్ ఎపిసోడ్స్ కొనసాగుతున్నాయి. ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి వీకెండ్ లో కూడా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ లేదా సన్నిహితులు స్టేజీపైకి వస్తున్నారు. హౌస్ మేట్స్ తో మాట్లాడి తప్పొప్పులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఆదివారం (నవంబర్ 23) మరికొంత మంది కంటెస్టెంట్లకు సంబంధించిన వాళ్లు స్టేజీ మీదకు రానున్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు పదకొండో వారంలో ఇవాళ ఆదివారం తనూజ పుట్టస్వామి కోసం ముద్ద మందారం సీరియల్ టీమ్ స్టేజీపైకి వచ్చింది. ఆ సీరియల్ హీరో పవన్ సాయి, కీ క్యారెక్టర్ హరిత వచ్చారు. వాళ్లను చూడగానే ముఖ్యంగా హరితను చూసి తనూజ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. హరిత కూడా స్టేజీపై ఎమోషనల్ అయింది. పవన్ ఆమెను ఓదార్చాడు.

సండే ఎపిసోడ్ లో తనూజ పు...