Hyderabad, మే 1 -- ఆహా వీడియో ఓటీటీలోకి ఇప్పుడో తమిళ ఆంథాలజీ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. కేవలం నాలుగు ఎపిసోడ్ల ఈ సిరీస్ గతేడాది తమిళంలో రాగా.. ఇప్పుడు తెలుగులోకి డబ్ అయింది. నాలుగు వేర్వేరు కథల సమాహారమే ఈ సిరీస్. ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పే లేడీ టీచర్ ఎపిసోడ్ కు సంబంధించిన చిన్న టీజర్ ను ఆహా ఓటీటీ షేర్ చేసింది.

ఆహా వీడియో ఓటీటీలోకి తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చిన బోల్డ్ ఆంథాలజీ సిరీస్ పేరు ష్ (Sshhh). ఇది గతేడాదే తమిళంలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. నాలుగు ఎపిసోడ్లు కలిపి రెండు గంటల్లో ముగిసిపోయే సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో స్టోరీ గురించి చూపిస్తారు. ఇందులో భాగంగా ఆహా వీడియో తొలి ఎపిసోడ్ టీజర్ ను రిలీజ్ చేసింది.

ఇందులో ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయికి ఓ స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ...