Hyderabad, సెప్టెంబర్ 29 -- మలయాళం థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్.. మీకోసం మరో సినిమా రాబోతోంది. ఈ మూవీ పేరు మిరాజ్ (Mirage). సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైంది. జీతూ జోసెఫ్ డైరెక్టర్ కావడం, అందులోనూ థ్రిల్లర్ జానర్ లో రావడంతో భారీ అంచనాలు మధ్య రిలీజైంది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు నెల రోజుల్లో ఓటీటీలోకి రాబోతోంది.

మలయాళం థ్రిల్లర్ మూవీ మిరాజ్ థియేటర్లలో రిలీజైన నెల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. మిరాజ్ అంటే ఎండమావి అని అర్థం. ఇదో థ్రిల్లర్ సినిమా. ఈ మూవీ అక్టోబర్ 23 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉంది.

దృశ్యం, నేరు, మెమొరీస్ లాంటి థ్రిల్లర్ సినిమాలను అందించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే గతంలోని అతని థ్రిల్లర్స్ తో పోలిస్తే.. ఇది చాలా వీక్ గా ఉందన్న రివ్యూల...