భారతదేశం, జనవరి 28 -- ప్రముఖ నటి కీర్తి సురేష్ 2024లో గోవాలో తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఏషియన్ పెయింట్స్ సహకారంతో తమ ఇంటిని అభిమానులకు చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తమ ఇంటిని వారు సరదాగా 'హౌస్ ఆఫ్ ఫన్' అని పిలుచుకుంటారు. ఈ వీడియోలో కీర్తి తన పెళ్లి రోజున జరిగిన ఒక ఎమోషనల్ సంఘటనను గుర్తుచేసుకుంది.

15 ఏళ్ల ప్రేమ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ఒక్కటైన ఆ క్షణాన్ని కీర్తి సురేష్ గుర్తుచేసుకుంటూ.. "మేము ఇలాంటి పెళ్లి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలంటే మేము లేచిపోవాలని అనుకున్నాం. ఇంత ఘనంగా పెళ్లి జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కానీ నిజంగా పెళ్లి జరుగుతున్నప్పుడు, ఒక దశలో మాకు మాటలు రాలేదు" అని చెప్పింది.

పెళ్లిలో అత్యంత భావోద్వేగమైన క్షణం గురించి ఆమె వి...