భారతదేశం, జనవరి 13 -- సినీ ఇండస్ట్రీలో కేవలం నటనకు మాత్రమే పరిమితం కానీ నటీనటులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరే రోహిణి మొల్లెటి. ఐదేళ్లకు తెలుగు చిత్రసీమలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి హీరోయిన్‌గా నటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనాకపల్లిలో జన్మించిన రోహిణి 1974 నుంచి ఇప్పటి వరకు వెండితెరపై నటిగా రాణిస్తున్నారు. కేవలం నటిగానే కాకుండా రోహిణి ఇదివరకు హీరోయిన్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, సింగర్‌గా కూడా వర్క్ చేశారు.

1995లో వచ్చిన స్త్రీ అనే సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ (స్పెషల్ మెన్షన్) అందుకున్న రోహిణి ఉత్తమ నటనకు గానూ స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా తీసుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ నటిగా 2017లో వనిత ఫిల్మ్స్ అవార్డ్, సీపీసీ అవార్డ్స్ గెలుచుకున్నారు రోహిణి. ఎక్కువగా తెలుగు, మలయాళం, తమిళ సిన...