Hyderabad, అక్టోబర్ 10 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభం నుంచి జోరు చూపిస్తోంది. అయితే, గొత కొన్నిరోజులుగా మాత్రం కాస్తా చప్పగా సాగుతోంది. ఇక మొత్తానికి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఐదో వారం మిడ్ వీక్‌కు వచ్చేసింది. ఈ ఐదో వారం ఏకంగా పది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో సుమన్ శెట్టి, తనూజ గౌడ, భరణి, ఫ్లోరా సైని, రీతూ చౌదరి, డీమోన్ పవన్, శ్రీజ దమ్ము, కల్యాణ్ పడాల, సంజన గల్రాని, దివ్య నిఖితా పది మంది మొదటగా ఉన్నారు. అంటే, కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ పొందిన ఇమ్మాన్యుయెల్ తప్పా మిగతా నామినేషన్స్‌కు వచ్చారు.

వీరందరికి టాస్క్‌లు నిర్వహించి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యే ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. అలా ఇప్పటివరకు కల్యాణ్, భరణి, దివ్య మాత్రమే సేవ్ అయ్యారు. తాజాగా ఇవాళ్టీ ఎపిసోడ్‌లో తనూజ కూడా సేవ్ అయిన...