భారతదేశం, డిసెంబర్ 30 -- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఈ నెల మొదట్లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఓ ఇంటివారైన ఈ అమ్మడు, ప్రస్తుతం తన భర్తతో కలిసి పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో సందడి చేస్తున్నారు. తమ 'హనీమూన్' ట్రిప్‌కు సంబంధించిన అందమైన ఫోటోలను సమంత మంగళవారం (డిసెంబర్ 30) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

లిస్బన్‌లోని చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలను ఈ జంట ఎంతో ఉత్సాహంగా అన్వేషిస్తున్నారు. ఫాతిమాలోని 'బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది రోసరీ', ప్రసిద్ధ 'మాన్యుమెంట్ టు ది డిస్కవరీస్', 'ఆర్కో డా రువా అగస్టా' వంటి ప్రాంతాలను సమంత, రాజ్ నిడిమోరు సందర్శించారు.

ఒక ఫోటోలో రాజ్ నిడిమోరు నోరూరించే చాక్లెట్ డోనట్‌ను ఆశగా చూస్తుండగా, మరో ఫోటోలో సమంత అక్కడ...