భారతదేశం, జనవరి 28 -- ఇండస్ట్రీలోని హీరోలందరూ ఒక్కటే. వాళ్లకు ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటారు. కానీ కొన్ని సార్లు ఫ్యాన్స్ అదుపు తప్పుతారు. అభిమానులు లిమిట్స్ క్రాస్ చేస్తారు. తాజాగా ప్రభాస్ అభిమానులు ఇలాగే ప్రవర్తించారు. ఓ థియేటర్లో పోస్టర్ పై చిరంజీవి ముఖంపై ప్రభాస్ మాస్క్ పెట్టారు. ఇదంతా వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పని ఇంటర్నెట్ లో తీవ్ర విమర్శల పాలవుతోంది. చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ టాక్ తో సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ గుంపు కలిసి చిరంజీవి ముఖంపై తమ హీరో మాస్క్ పెట్టారు. ఓ థియేటర్లో ఇది జరిగింది. మాస్క్ పెట్టడమే కాకుండా చిరంజీవిని అవమానించేలా మాటలన్నారు. ఇదంతా వీడియోలో వినపడింది. థియేటర్ యాజమాన్యం వచ్చి అలా చేయొద్దని చెప్పడంతో ఆ అభిమానులు వెళ్లిపోయారు....