భారతదేశం, జూలై 22 -- వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని దాఖలైన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణలను ముగించింది. విచారణ సందర్భంగా ఎంపీకి కల్పించే సౌకర్యాల గురించి కోర్టు జైళ్ల శాఖ అధికారులను ప్రశ్నించింది. అవసరమైన నిబంధనలు పాటిస్తున్నామని అంగీకరిస్తూ అధికారులు సానుకూలంగా స్పందించారు.

మిథున్ రెడ్డి పిటిషన్లపై అభ్యంతరాలుంటే నేరుగా కోర్టుకు హాజరై చెప్పాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో అధికారి కోర్టుకు హాజరు అయ్యారు. సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అయితే ఇంటి నుంచి ఆహారం అనుమతించాలంటే అండర్ టేకింగ్ లెటర్ అవసరమని చెప్పారు.

ఎంపీ మిథన్ రెడ్డి తన పిటిషన్ ద్వారా అనేక సౌకర్యాలను అభ్యర్థించారు. టీవీ, మంచం, వెస్ట్రన్ కమ...