భారతదేశం, ఏప్రిల్ 19 -- ఏపీ లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి.. ఓ ఆడియో విడుదల విడుదల చేశారు. సిట్ నోటీసులు, విజయసాయి మాటలపై ఆడియో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అవుతోంది. దీంట్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.

'మార్చిలో సిట్‌ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. నన్ను విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వమని అడిగా. నా ఈ మెయిల్‌కు సెకండ్‌ నోటీసు ఇచ్చారు. నేను నా లాయర్లను సంప్రదించా. ముందస్తు బెయిల్‌ కోసం కూడా పిటిషన్ వేశా. సిట్‌ విచారణకు నేను పూర్తిగా సహకరిస్తా' అని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

శుక్రవారం సిట్ విచారణ అనంతరం విజ...