భారతదేశం, నవంబర్ 19 -- ఏపీ మద్యం కుంభకోణంలో నిందితులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుంభకోణం వైసీపీ పాలనలో జరిగింది. సిట్ ముందుకు సాగుతున్న కొద్దీ, ప్రతి అడుగుతో కొత్త లింకులు బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్‌లో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది.

అంతకుముందు దర్యాప్తులో భాగంగా అధికారులు A1 రాజ్ కాసిరెడ్డి ఆస్తులను జప్తు చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి ఆస్తులను కూడా అధికారులు జప్తు చేస్తారు. కేవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మీ ఆస్తులను కూడా జప్తు చేయాలని నిర్ణయించారు. ఓ వైపు వైసీపీ దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసు...