భారతదేశం, జూలై 20 -- ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిథున్‌రెడ్డిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించనున్నారు.

మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత. కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వైసీపీ లోక్ సభ సభ్యుడుగా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ శనివారం అరెస్ట్ చేసింది. కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత.. రాత్రి 7.30 గంటలకు విజయవాడలో అరెస్ట్ చేసింది.

మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ధన...