Andhrapradesh, జూన్ 18 -- ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు సిట్ విచారణ వేగవంతం చేస్తుండటంతో పాటు మరోవైపు అరెస్టులపర్వం కూడా కొనసాగుతోంది. తాజాగా ఇదే కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది.

బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు వెంకటేశ్‌నాయుడిని (ఏ-34) కూడా అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఏ -38గా చేర్చారు . తాజాగా జరిగిన అరెస్టులతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 9 మందిని సిట్ అరెస్ట్ చేసింది. మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ ఆఫీస్‌కు తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారించే అవకాశం ఉంది. ఆపై కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ఇక ఈ కేసులో...