భారతదేశం, మే 16 -- ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు సిట్ ఆఫీసర్లు ప్రకటించారు. ఇప్పటికే వీరి సెల్‍ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టిన సమాచారం. గత ప్రభుత్వంలో ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ ఇద్దరి అరెస్టుతో తర్వాత టార్గెట్ ఎవరనే చర్చ జరుగుతోంది.

2019 నుండి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో దాదాపు రూ.3,200 కోట్ల నుండి రూ.3,500 కోట్ల వరకు అక్రమంగా సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చి.. కొన్ని తక్కువగా తెలిసిన బ్రాండ్లను ప్రోత్సహించి, బాగా ప్రాచుర్యం పొందిన బ్రా...