భారతదేశం, మే 5 -- విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌పై ఆయన సోదరుడు మాజీ ఎంపీ నాని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన వ్యక్తులతో ఎంపీకి సంబంధం ఉందని ఆరోపించారు. లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని సహచరుడు దిలీప్ పైలాతో శివనాథ్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

మాజీ ప్రభుత్వ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అతనికి చెందిన ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్‌పిలో ఎంపీ కేశినేని శివనాథ్, తని భార్య జానకి లక్ష్మి కేశినేని భాగస్వాములుగా ఉన్నారని, ఈ సంస్థ హైదరాబాద్‌లో ఉందని పేర్కొన్నారు.

కేసిరెడ్డి, అతని సహచరుడు దిలీప్ పైలా నిర్వహించే ఎషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాలో ఉందని నాని వివరించారు. ప్ర...