భారతదేశం, మే 16 -- జగన్‌ టార్గెట్‌గా అక్రమ కేసులు పెడుతున్నారని.. మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. స్కిల్‌ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారన్న నాని.. ఒక్క రోజైనా అదనంగా జగన్‌ను జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందరపడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసు నడుపుతున్నారని విమర్శించారు. లిక్కర్‌ కేసులో దొంగ సాక్ష్యాలు సేకరిస్తున్నారన్న పేర్ని.. ఈ కేసుతో జగన్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై.. కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైసీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పని చేస్తోందనన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే.. నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని స...