భారతదేశం, జూలై 12 -- భారత క్రికెట్ జట్టు స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. లార్డ్స్ లో సెంచరీతో సత్తాచాటాడు. ఈ ప్రతిష్ఠాత్మక మైదానంలో శతకంతో అక్కడ హానర్ బోర్డులో రెండో సారి పేరు ఎక్కేలా చేసుకున్నాడు. ఇంగ్లాండ్ తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీతో టీమిండియా పోరాడుతుంది. కానీ సెంచరీ కాగానే రాహుల్ ఔటవడం, అంతకంటే ముందు పంత్ రనౌట్ తో టీమ్ కష్టాల్లో పడింది.

ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో కేఎల్ రాహుల్ సత్తాచాటాడు. లార్డ్స్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ బాదేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో ఓపికతో నిలబడ్డాడు. స్టైలిష్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను అలరించాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాడు. టెస్టు ఫార్మాట్ కు తగ్గట్లుగా ఓపికతో క్రీజులో పాతుకుపోయాడు. 176 బంతుల్లో సె...