భారతదేశం, మే 15 -- హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా పలు హెవీవెయిట్స్ షేర్ల నేతృత్వంలో భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 గురువారం ఘన లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 81,330.56 వద్ద ప్రారంభమై, 1,388 పాయింట్లు లేదా 1.7 శాతం పెరిగి 82,718 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 50 సూచీ 24,694.45 వద్ద రోజును ప్రారంభించి 1.8 శాతం పెరిగి 25,116 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరకు 30 షేర్ల ఇండెక్స్ సెన్సెక్స్ 1,200 పాయింట్లు లేదా 1.48 శాతం లాభంతో 82,530.74 వద్ద ముగియగా, నిఫ్టీ 395 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో 25,062.10 వద్ద ముగిసింది. బిఎస్ ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ అర శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం పెరిగింది.

భారత స్టాక్ మార్కెట్లో పదునైన ర్యాలీ వెనుక ఈ క్రిం...