భారతదేశం, ఏప్రిల్ 13 -- 2025 బజాజ్ ప్లాటినా 110 లాంచ్‌‌కు రెడీ అవుతోంది. అయితే దీనికంటే ముందుగానే షోరూమ్‌లకు రావడం ప్రారంభించింది. ఈ బైక్‌కు కంపెనీ పలు అప్‌డేట్స్ చేసింది. సరసమైన, నమ్మదగిన బైక్ కోసం చూస్తుంటే.. 2025 బజాజ్ ప్లాటినా 110 మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లాంచ్‌కు ముందే దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ షోరూమ్‌లలో ఈ బైక్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో అనేక మార్పులు చేశారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

కొత్త ప్లాటినా 110 బలమైన కొత్త కలర్ కాంబినేషన్‌ను పొందుతుంది. లైట్ గ్రీన్ కలర్ హైలైట్స్, బ్లాక్ బేస్‌తో గ్రాఫిక్స్ బైక్‌కు స్పోర్టీ, ఫ్రెష్ లుక్‌ను ఇస్తాయి. అల్లాయ్ వీల్స్‌పై ఆకుపచ్చ పిన్ స్ట్రిప్పింగ్ కూడా కనిపిస్తుంది. 2024 వెర్షన్‌లో ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, కాక్టెయిల్ వైన్ రెడ్-ఆరెంజ్ వంటి కలర్ ఆప్షన్లు ...