భారతదేశం, నవంబర్ 24 -- రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెలుగులో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ మరువ తరమా. ఈ సినిమాలో హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వాల ప్రధాన పాత్రలు పోషించారు. మరువ తరమా సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే చైతన్య వర్మ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.

మరువ తరమా చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్, వి విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా నిర్మించారు. నవంబర్ 28న థియేటర్లలో మరువ తరమా సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికీ రిలీజ్ చేసిన ప్రమోషనల కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

తాజాగా మరువ తరమ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మరువ తరమా ట్రైలర్ స్వచ్ఛమైన లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా మూడు పాత్రల చుట్టూ సాగుతుందని అర...