Hyderabad, ఆగస్టు 9 -- ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ తెరకెక్కుతోంది. ఈ మూవీని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కీర్తన నరేష్ టీఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి "కాగితం పడవలు'అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఇవాళ (ఆగస్టు 9) కాగితం పడవలు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం లవ్లీ ఎమోషన్స్‌తో ఈ గ్లింప్స్ సాగింది. కేవలం 28 సెకన్ల రన్ టైమ్ ఉన్న కాగితం పడవలు గ్లింప్స్‌లోని రెండే రెండు డైలాగ్స్ హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి.

"చాలా దూరం వెళ్లిపోయావు గోదావరి" అని అబ్బాయి గొంతు అంటే.. "నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్" అని అమ్మాయి వాయిస్ వినిపించింది. ఆ డైలాగ్స్‌కు తగినట్లుగా బీచ్ వ్యూ చూపించారు. ఎంతో ఆహ్లాదం...