భారతదేశం, జూలై 4 -- సిద్ధార్థ్, శరత్ కుమార్, మీతా రఘునాథ్, దేవయాని, యోగిబాబు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ 3 బీహెచ్‌కే. ఈ రోజు (జూలై 4) థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వచ్చిన రివ్యూల ప్రకారం సినిమా మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు హృదయాన్ని హత్తుకునే కథతో నిండి ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీని చూసి తమిళ హీరో శింబు (సిలంబరసన్ టీఆర్) కూడా మనసు పారేసుకున్నాడు.

సిలంబరసన్ టిఆర్ అలియాస్ శింబు ఎక్స్ లో ఇలా రాసుకొచ్చాడు. "3 బీహెచ్‌కే చూశాను. ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్లే హృద్యమైన అందమైన చిత్రం. టీమ్ అందరికీ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్'' అని శింబు పేర్కొన్నాడు. ''3 బీహెచ్‌కే నన్ను బాల్యంలోకి తీసుకెళ్లింది'' ఒక ఎక్స్ యూజర్.. 'కంప్లీట్ ఫిల్మ్' అని పిలిచాడు, ''3 బీహెచ్‌కే అంటే ప్రేమ, 3 బీహెచ్‌కే అనేది వాస్తవం, 3 బీహెచ్‌కే...