భారతదేశం, సెప్టెంబర్ 18 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి సూపర్ హిట్ రియాలిటీ డేటింగ్ షో 'లవ్ ఈజ్ బ్లైండ్' కొత్త సీజన్ తో తిరిగి రాబోతోంది. ఈ లవ్, రొమాంటిక్ షో సీజన్ 9 స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సీజన్ 9లో 32 మంది సింగిల్స్ లవ్, రొమాన్స్ ను వెతుక్కుంటారు. ఈ సూపర్ హిట్ డేటింగ్ షో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

డేటింగ్ రియాలిటీ షో లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 9 ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 1, 2025 నుంచి ఈ కొత్త సీజన్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సారి కొలరాడోలోని డెన్వర్‌లో సెట్ చేసిన ప్లేస్ లో డేటింగ్ షో లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 9 సాగుతుంది. అక్టోబర్ 1, 2025న ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సీజన్ అడుగుపెడుతుంది. ఆ తర్వాత ప్రతి బుధవారం కొత్త ఎపిసోడ్‌ రిలీజ్అవుతుంది. గత సీజన్‌లన్నీ కూడా ఈ ప్...