భారతదేశం, అక్టోబర్ 8 -- మలయాళ చిత్ర పరిశ్రమలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు కలకలం సృష్టించాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు సంబంధించిన ఆస్తులపై దాడులు జరగడం పెద్ద చర్చనీయాంశమైంది. భూటాన్ నుంచి లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసులో ఆర్థిక అవకతవకలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ దాడులను ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA), 1999 కింద చేపట్టింది. ఈ దర్యాప్తు కస్టమ్స్ అధికారులు గతంలో నమోదు చేసిన కేసుతో ముడిపడి ఉంది.

అక్రమ రవాణా: భూటాన్, నేపాల్ సరిహద్దుల గుండా ల్యాండ్ క్రూయిజర్స్, డిఫెండర్స్ వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ వాహనాలను అక్రమంగా భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటున్నారు.

పన్ను ఎగవేత...