భారతదేశం, మే 12 -- తనదైన కామెడీ టైమింగ్ తో, పంచ్ డైలాగ్ లతో, మీమ్స్ రీ క్రియేషన్ తో ఫ్యాన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్న హీరో శ్రీ విష్ణు మరో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆయన లేటెస్ట్ మూవీ 'సింగిల్' థియేటర్లలో అదరగొడుతోంది. ఈ కామెడీ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. ఈ మూవీ లాభాల్లోకి దూసుకెళ్లనుంది.

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన కొత్త సినిమా 'సింగిల్' మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిందనే చెప్పొచ్చు. ఈ మూవీని దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూను రూ.7 కోట్లుగా తేల్చారు. ఇప్పుడు థియేటర్లలో ఈ మూవీ మూడు రోజుల్లో రూ.14.5 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025ను సస్పెండ్ చేయడం, వీకెండ్ విష్ణు సినిమా 'సింగిల్' కల...