భారతదేశం, డిసెంబర్ 28 -- లక్ అంటే ఇదే.. అవును ఈ వార్త చదివిన తర్వాత మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు. లేకపోతే ఓ క్రికెట్ మ్యాచ్ చూద్దామని స్టేడియానికి వెళ్లిన ఓ అభిమాని రూ.1.08 కోట్లతో తిరిగొచ్చాడు. మ్యాచ్ లో అతను ఒంటి చేత్తో క్యాచ్ పట్టడమే ఇందుకు కారణం. ఈ అనూహ్య ఘటన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో జరిగింది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో బ్యాటర్లు కొట్టే సిక్సర్లు స్టాండ్స్ లో పడటం చూస్తుంటాం. అలాంటి ఓ సిక్సర్ ను ఒంటిచేత్తో పట్టడంతో ఈ ఫ్యాన్ తలరాతే మారిపోయింది. ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025 సీజన్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఇది జరిగింది.

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో 'క్యాచ్ 2 మిలియన్' అనే ప్రమోషనల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్టాండ్స్ లో ఉండే ఎవరైనా బ్యాటర్ కొట్టిన సిక్సర్ ను ఒంటిచేత్తో క్యాచ్ పడితే 2 మిలియన...