భారతదేశం, జూన్ 21 -- ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర చిత్రం ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ రిలీజ్ ల్లో ఒకటిగా నిలిచింది. ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫీల్ గుడ్ సినిమాలు తీసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా రావడం, ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో కుబేరపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరి జూన్ 20న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఫస్ట్ డే ఎన్ని కోట్లు రాబట్టింది? ఇక్కడ చూద్దాం.

ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ కుబేర సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఇండియాలో తొలి రోజు రూ.13 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైంది ఈ సినిమా. అయితే స్టార్ కాస్ట్, స్టోరీ లైన్ చూసుకుంట...