భారతదేశం, జూలై 14 -- లండన్: లండన్ సౌతెండ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్ ప్యాసింజర్ జెట్ విమానం కూలిపోయింది. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయిన వెంటనే ఈ చిన్న ప్యాసింజర్ జెట్ కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగి, ఎసెక్స్ అంతటా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. నెదర్లాండ్స్ వెళ్లాల్సిన ఈ విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే నేలకూలింది.

బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్ అనేది రెండు టర్బోప్రాప్ ఇంజిన్లతో నడిచే విమానం. ఇది గాల్లో తన బహుముఖ ప్రజ్ఞకు, పనితీరుకు ప్రసిద్ధి చెందింది. air-tecm.com ప్రకారం, ఈ విమానంలో ఇద్దరు సిబ్బందితో పాటు 9 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అందుకే ఇది వ్యాపార, వైద్య అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.

ఈ విమానం 57 అడుగుల రెక్కల వెడల్పు (wingspan), 303 చదరపు అడుగుల వింగ...